ఏపీలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
లెక్చరర్ పోస్టులు: 21
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 2
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ - 1
కెమికల్ ఇంజనీరింగ్ - 1
సివిల్ ఇంజనీరింగ్ - 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 1
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 4
ఇంగ్లీష్ - 3
మ్యాథ్స్ - 1
మెకానికల్ ఇంజనీరింగ్ - 2
మైనింగ్ ఇంజనీరింగ్ - 1
అర్హత: సంబంధిత బ్రాంచిలో ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: ఏప్రిల్ 24, 2023
చివరి తేదీ: మే 17, 2023.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: మే 16, 2023.
వెబ్సైట్: https://psc.ap.gov.in