SSC నుంచి 1342 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-07-27 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2023 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. దీని ద్వారా మొత్తం 1342 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం పోస్ట్‌లు: 1342

అర్హత: పోస్ట్‌లను బట్టి అభ్యర్థులు సివిల్/ మెకానికల్/ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 26-07-2023

చివరి తేదీ: 16-08-2023

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: రూ.100

SC/ST/PWD అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు

వయస్సు:

గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

వెబ్‌సైట్: https://ssc.nic.in/

నోటిఫికేషన్: https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/NOTICE_JE_2023_26072023.pdf


Similar News