తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, కెరీర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి ఆశా కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హరీష్‌రావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసి పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులను జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేస్తారు.
ఖాళీల వివరాలు:
హైదరాబాద్- 323
మేడ్చల్ జిల్లా - 974
రంగారెడ్డి జిల్లా- 243