గుంటూరు జిల్లాలో 54 బ్యాక్‌లాగ్ పోస్టులకు నోటిఫికేషన్

గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ, వివిధ విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి గుంటూరు జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

Update: 2023-03-29 11:21 GMT

దిశ, కెరీర్: గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ, వివిధ విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి గుంటూరు జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న గుంటూరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 54

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్ - 2

జూనియర్ స్టెనో - 1

టైపిస్ట్ - 3

మాట్రాన్ కమ్ స్టోర్ కీపర్ - 1

ఆఫీస్ సబార్డినేట్ - 8

మెసెంజర్ - 2

ల్యాబ్ అసిస్టెంట్ - 1

ల్యాబ్ అటెండర్ - 1

వర్క్ షాప్ అటెండర్ - 1

స్కిల్డ్ వర్క్ మ్యాన్ - 1

ఫిషర్ మ్యాన్ - 1

శానిటరీ (పబ్లిక్ హెల్త్) మేస్త్రీ - 1

వాచ్ మ్యాన్ - 9

వాటర్ మ్యాన్ - 1

స్వీపర్ - 3

పబ్లిక్ హెల్త్ వర్కర్ - 12

గ్యాంగ్ మజ్దూర్ - 2

డ్రెయిన్ క్లీనర్ - 1

కళాసి - 1

హోల్ టైమ్ సర్వెంట్ - 1

లస్కర్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి తెలుగు/ఇంగ్లీష్ భాషలో చదవడం, రాయడం, 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, టైప్ రైటింగ్ సర్టిఫికెట్ మొదలగు అర్హతలు ఉండాలి.

వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 11, 2023.

వెబ్‌సైట్: https://www.gunturap.in/2023

Tags:    

Similar News