ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్ -2 /2023)
వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్ - 2/2023)కు సంబంధించి సంక్షిప్త ప్రకటన విడుదలైంది.
దిశ, కెరీర్: వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్ - 2/2023)కు సంబంధించి సంక్షిప్త ప్రకటన విడుదలైంది. కోర్సు జులై 2024లో ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్ 2/2023, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ)
1. ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/టెక్నికల్/వెప్ షిస్టమ్/అడ్మినిస్ట్రేషన్/లాజిస్టిక్స్/అకౌంట్స్ /ఎడ్యుకేషన్/మెటియరాలజీ
2. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్)
అర్హతలు: ఇంటర్ (ఫిజిక్స్, మ్యాథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక: పోస్టులను అనుసరించి ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్ - 1, స్టేజ్ - 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన .. ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 1, 2023
చివరితేదీ: జూన్ 30, 2023
నోట్: ఇతర వివరాలు జూన్ 1న వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT/