పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ట్రైనీ ఉద్యోగాలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 203
పోస్ట్ పేరు: జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్)
అర్హత: ITI(ఎలక్ట్రికల్)
వయస్సు: 18-27 ఏళ్లు.
జీతం: రూ.21,500.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.200.
SC/ST/PwBD/Ex–SM అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-11-2023
చివరి తేదీ: 12-12-2023