TSSPDCLలో 1,601 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
దిశ, కెరీర్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
జూనియర్ లైన్‌మెన్: 1,553 పోస్టులు (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ - 553; జనరల్ రిక్రూట్‌మెంట్ - 1000)
అర్హత: పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్ మెన్) లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 24,340 నుంచి రూ. 39,405.
ఎంపిక: రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష కేంద్రాలు: జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: మార్చి 28, 2023.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 4, 2023.
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com