ITBP Notification : కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువత దరఖాస్తు చేసుకోవచ్చు.

Update: 2024-08-12 03:31 GMT

దిశ, ఫీచర్స్ : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువత దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ సి కోసం ఐటీబీపీ ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2024. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ITBP recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

ITBP కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మేసన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. కానిస్టేబుల్ (కార్పెంటర్) 71 పోస్టులు, కానిస్టేబుల్ (ప్లంబర్) 52 పోస్టులు, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) 64 పోస్టులు, ఎలక్ట్రీషియన్ (మేసన్) 15 పోస్టులు కలిపి మొత్తం 202 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది.

విద్యార్హత, వయోపరిమితి ?

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ITI సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతకు సంబంధించిన ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు ITBP నోటిఫికేషన్‌ను చూడవచ్చు. ఇక వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 23 సంవత్సరాలు ఉండాలి. OBC, SC, ST సహా రిజర్వ్డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు.

వేతనం..

ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారికి రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థులను PET అంటే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ITBP గ్రూప్ C కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఆగస్టు 12 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Tags:    

Similar News