ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2023
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ 2023 ద్వారా అర్హత కలిగిన యువతను అగ్నివీరులుగా నియమించనుంది. దీనిలో చేరిన వారు నాలుగు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం పోస్ట్‌ల సంఖ్య 3,500 కు పైగా ఉన్నట్టు సమాచారం.
పోస్ట్ పేరు: ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్
మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 3500(అంచనా)
అర్హత: 10+2/ మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. పోస్టులకు అనుగుణంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
సర్వీస్ పీరియడ్: నాలుగు ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ. 250.
వయస్సు: అభ్యర్థులు జూన్ 27, 2003 - డిసెంబర్ 27, 2006 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: రూ. 30,000 నుంచి ప్రారంభం
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-07-2023
చివరి తేదీ: 17-08-2023
పరీక్ష తేదీ: 13-10-2023
వెబ్సైట్: https://agnipathvayu.cdac.in/AV/