భారత్ ఎర్త్ మూవర్స్‌లో గ్రూప్-సి ట్రైనీ ఉద్యోగాలు
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) గ్రూప్-సి (డిప్లొమా ట్రైనీ, ఐటీఐ ట్రైనీ, స్టాఫ్ నర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) గ్రూప్-సి (డిప్లొమా ట్రైనీ, ఐటీఐ ట్రైనీ, స్టాఫ్ నర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 119 ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 119
1. డిప్లొమా ట్రైనీ మెకానికల్
2. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్
3. డిప్లొమా ట్రైనీ- సివిల్
4. ITI ట్రైనీ - మెషినిస్ట్
5. ఐటీఐ ట్రైనీ - టర్నర్
6. స్టాఫ్ నర్స్
అర్హత: అభ్యర్థులు విభాగాలను బట్టి డిప్లొమా/ITI/BSc (నర్సింగ్) చేసి ఉండాలి.
ఫీజు:
జనరల్/ EWS/ OBC వారికి రూ.200.
SC/ST/ PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
జీతం: పోస్టుల ఆధారంగా రూ.16,900-85,570.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29-09-2023
చివరి తేదీ: 18-10-2023.
వెబ్‌సైట్: https://www.bemlindia.in/