నిరుద్యోగులకు శుభవార్త.. 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2023-04-10 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో 9,231 పోస్టులను భర్తీ చేయనున్నారని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటన చేసింది. కాగా.. మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. 9,231 పోస్టుల్లో 4020 టీజీటీ పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ల వారీగా వివిధ కేటగిరిల్లో ఖాళీలను పరిశీలిస్తే.. డిగ్రీ కాలేజ్‌ల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ల పోస్టులు 868, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు-2008, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్-1276, పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు-434, స్కూల్స్‌లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు- 275, డ్రాయింగ్ టీచర్స్/ఆర్ట్ టీచర్స్ పోస్టులు-134, క్రాప్ట్ ఇన్‌స్ట్రక్టర్స్/ క్రాఫ్ట్ టీచర్స్-92, మ్యూజిక్ టీచర్స్-124, టీజీటీ పోస్టులు-4,020 ఉన్నాయి.

అభ్యర్థులకు పూర్తి సమాచారం కోసం https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఈ నెల(ఏప్రిల్) 12 నుంచి వన్‌టైమ్ రిజిస్టేషన్లు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేయడానికి, ఇతర ముఖ్యమైన తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీఆర్‌ఈఐ-ఆర్‌బీ కన్వీనర్ బట్టు మల్లయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి:

లేటెస్ట్ కరెంట్ అఫైర్స్.. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ - ఏప్రిల్ 8, 2023  

Tags:    

Similar News