ESIC Job Notification: ఈఎస్ఐసీ లో.. ఉద్యోగాలు!
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation).. ఒప్పంద ప్రాతిపదికన 70 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని సనత్ నగర్ లో.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(Employees State Insurance Corporation).. ఒప్పంద ప్రాతిపదికన 70 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఫ్యాకల్టీ పోస్టులు: 39 (ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్)
సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 31
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్/ఎండీ/డీఎన్ బీ తో పాటు బోధనానుభవం ఉండాలి.
వయసు: ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.2,45,295; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,63,116; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,19,829; సీనియర్ రెసిడెంట్ పోస్టుకు రూ.67,700 - రూ.1,40,139.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ ఎక్స్ సర్వీస్ మెన్/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 19, 20, 21, 23, 24, 25.
వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్.
వెబ్ సైట్: https://www.esic.gov.in/