ఈ అర్హతలుంటే చాలు.. ఇస్రోలో ఉద్యోగం మీ సొంతం
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఇంజనీర్ (గ్రూప్- గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఇంజనీర్ (గ్రూప్- గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, మెకానికల్; కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 303
పోస్టు: సైంటిస్ట్/ఇంజనీర్ (ఎస్‌సీ)
ఎలక్ట్రానిక్స్ - 90
కంప్యూటర్ సైన్స్ - 47
ఎలక్ట్రానిక్స్ అటానమస్ బాడీ- పీఆర్ఎల్ - 2
కంప్యూటర్ సైన్స్ అటానమస్ -పీఆర్ఎల్ - 1
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూన్ 14, 2023 నాటికి 28 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 56,100 ప్రారంభ వేతనం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 250.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 25, 2023.
చివరి తేదీ: జూన్ 14, 2023.
వెబ్‌సైట్: https://www.isro.gov.in/