ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెట్రోరైల్ కార్పోరేషన్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్ సీఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: భారత ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్ సీఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 68
పోస్టుల వివరాలు:
డిప్యూటీ చీఫ్ ఇంజనీర్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అసిస్టెంట్ ఇంజనీర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 40 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
వేతనం:
డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ : నెలకు రూ. 1.4 లక్షలు
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : నెలకు రూ. 85,000
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ. 65,000
అసిస్టెంట్ ఇంజనీర్: రూ. 50,000
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చిరునామా: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, ఆర్ఎంటిసీ కాంప్లెక్స్, కె.హెచ్, రోడ్, శాంతినగర్, బెంగళూరు 560027.
చివరి తేదీ: ఏప్రిల్ 17, 2023.
వెబ్సైట్: https://english.bmrc.co.in