CTET 2022 ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ - 2022 ఫలితాలు మార్చి 3న సీబీఎస్ఈ విడుదల చేసింది
దిశ, కెరీర్: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ - 2022 ఫలితాలు మార్చి 3న సీబీఎస్ఈ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల కంప్యూటర్ ఆధారిత విధానంలో గత ఏడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు జరిగాయి. సీటెట్‌ను 32 లక్షలకు పైగా అభ్యర్థులు రాశారు. ఫైనల్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోరును వివిధ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.