తెలంగాణ హైకోర్టులో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాలు
తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది
దిశ, కెరీర్: తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్ /పర్సనల్ సెక్రటరీ - 20
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్ /సైన్స్/లా ) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 11, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
వేతనం: నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 చెల్లిస్తారు.
ఎంపిక: ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 21, 2023.
చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2023.
పరీక్ష తేదీ: మార్చి 2023.
వెబ్సైట్: https://tshc.gov.ఇన్