ఒకే రోజు నాలుగు పరీక్షలు.. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో అభ్యర్థులు

ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో ఉద్యోగార్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక సతమతం అవుతున్నారు

Update: 2023-12-05 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో ఉద్యోగార్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక సతమతం అవుతున్నారు. డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్‌ 17వ తేదీన ఇస్రోలో 65 పోస్టులకు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL)లో 232 ప్రొబేషనరీ ఇంజనీర్/ ఆఫీసర్ పోస్టులకు, తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్, 60 కెమిస్ట్‌ పోస్టులకు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఖాళీ పోస్టులకు ఈ తేదేనే పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులను నియామక సంస్థలు ఆయా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాయి. అయితే వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ పరీక్షను రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.


Similar News