నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 238 లోకో పైలట్‌ ఉద్యోగాలు

నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2023-04-11 10:15 GMT

దిశ, కెరీర్: నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ మే 6, 2023. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 238

కేటగిరీ వారీగా ఖాళీలు:

జనరల్ కేటగిరీకి 120, ఓబీసీలకు 36, ఎస్టీకి 18, ఎస్సీ 36 పోస్టులున్నాయి.

అర్హత:

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి.

వయసు:

దరఖాస్తుదారుల వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

అదే సమయంలో OBC కేటగిరీ కి వయోపరిమితి 45 సంవత్సరాలు

SC, ST వర్గాలకు 47 సంవత్సరాలు.

అప్లికేషన్ ఫీజు :

ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక:

CBT పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.

ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్‌కు పిలుస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 6, 2023

వెబ్‌సైట్: https://rrcjaipur.in/ లేదా https://nwr.indianrailways.gov.in


ఇవి కూడా చదవండి:

ఎయిర్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్.. ఎంపిక ఎలాగంటే..? 

Tags:    

Similar News