BSFలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్ గ్రూప్ -సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దిశ, కెరీర్: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్ గ్రూప్ -సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. ఏఎస్సై (కంపోజిటర్, మెషీన్‌మ్యాన్) : 3 పోస్టులు
2.హెడ్ కానిస్టేబుల్ (ఇంకర్ , వేర్‌హౌస్ మ్యాన్) : 2 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 5
అర్హత: పోస్టులను అనుసరించి 10+2 డిప్లొమా (ప్రింటింగ్) తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: ఏఎస్సై 18 నుంచి 28 ఏళ్లు, హెచ్‌సీ ఖాళీలకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏఎస్సైకి రూ. 29,200 నుంచి రూ. 92,300; హెచ్‌సీకి రూ. 25,500 నుంచి రూ. 81,100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in