కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగానే పోర్ట్లో ఉద్యోగాలు
దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ 2023 -24 విద్యా సంవత్సరానికి ఈ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ 2023 -24 విద్యా సంవత్సరానికి ఈ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 108
ట్రేడ్ అప్రెంటిస్, టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్షిప్.
విభాగాలు: ఫిట్టర్, డ్రాఫ్ట్ మ్యాన్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ .. తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ / సంబంధిత గ్రాడ్యుయేషన్ /డిప్లొమా డిగ్రీ/ ఐటీఐ, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.
స్టైపెండ్: సంబంధిత అప్రెంటిస్ను అనుసరించి రూ. 7,700 నుంచి 9,000 వరకు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023.
వెబ్సైట్: https://www.deendayalport.gov.in