APSRTC‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Update: 2023-08-04 15:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఆగస్టు 15లోగా ఆన్‌లైన్‌‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విజయనగరంలోని RTC జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఆగస్టు 18, 19, 21 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

విభాగాలు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్.

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ఫీజు: రూ.118.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15, 2023

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు:

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలు: 21-08-2023

తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు: 18-08-2023

విశాఖపట్నం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లాలు: 19-08-2023

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ స్థలం: ఆర్‌టీసీ, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరం.

వెబ్‌సైట్‌: https://www.apprenticeshipindia.gov.in/


Similar News