భారత సైన్యంలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్.. అగ్నిపథ్ పథకం కింద 2023-24

Update: 2023-02-16 16:59 GMT

దిశ, కెరీర్: భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్.. అగ్నిపథ్ పథకం కింద 2023-24 ఏడాది నియామకాలకు సంబంధించి అగ్నివీర్ జనరల్ డ్యూటీ (మహిళా మిలిటరీ పోలీస్) ఎంపికల కోసం అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామకాలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు అండమాన్ నికోబార్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేటగిరి: అగ్నివీర్ జనరల్ డ్యూటీ (మహిళా మిలిటరీ పోలీస్) పోస్టులు

వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2002 నుంచి అక్టోబర్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.

అర్హత: 45 శాతం మార్కులతో పదో తరగతి/మెట్రిక్యులేషన్, ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవర్ నియామకాలకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఫిజికల్ మెజర్‌మెంట్స్: ఎత్తు 162 సెం.మీ, ఛాతీ గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించేలా ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు,ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16, 2023.

చివరి తేదీ: మార్చి 15, 2023.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 17, 2023.

వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

Tags:    

Similar News