TSPSC కీలక ప్రకటన: మరో రెండు పరీక్షల తేదీలు వెల్లడి

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) తాజాగా ప్రకటించింది.

Update: 2023-05-24 15:16 GMT

దిశ, కెరీర్:  తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) తాజాగా ప్రకటించింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ నియామక పరీక్షను ఆగస్టు 8న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం:

మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్‌ జనరల్ ఎబిలిటీస్)- 150 ప్రశ్నలు-150 మార్కులుంటాయి.

పేపర్-2 (కామర్స్ - డిగ్రీ స్థాయి)- 150 ప్రశ్నలు-300 మార్కులకు ఉంటుంది.

పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.

సెప్టెంబర్‌ 12 నుంచి జేఎల్‌ పరీక్షలు మొదలు:

జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

జేఎల్ పరీక్ష విధానం:

ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్‌ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు)

పేపర్-2 అభ్యర్థి సంబంధిత సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు)

పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం ఉంటుంది.

Tags:    

Similar News