నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 850 అప్రెంటిస్ పోస్టులు
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టులను విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టులను విడుదల చేసింది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 850
పోస్టులు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-201
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-105
ట్రేడ్ అప్రెంటిస్-369
టెక్నీషియన్ అప్రెంటిస్- 175
అర్హత: పోస్టులను బట్టి ఇంజనీరింగ్/డిప్లొమా డిగ్రీ కలిగి ఉండాలి.
అభ్యర్థులు 2019/2020/2021/2022/2023లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్ వ్యవధి: 12 నెలలు.
స్టైపెండ్: పోస్టులను బట్టి రూ.12,524/రూ.15,028.
దరఖాస్తు చివరి తేదీ: 16-08-2023