కేంద్ర సాయుధ దళాల్లో 84,866 ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ దళాలలో మొత్తం 84,866 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.

Update: 2023-03-15 14:15 GMT

దిశ, కెరీర్: సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ దళాలలో మొత్తం 84,866 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్ర సాయుధ పోలీసు దళాల మొత్తం పోస్టుల సంఖ్య 10,05,520 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఐదు నెలల్లో సీఏపీఎఫ్‌లో 31,785 సిబ్బంది నియామకం జరిగినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వివరించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది!

ఖాళీల వివరాలు:

సీఆర్‌పీఎఫ్‌లో 29,283 ఖాళీలు

బీఎస్‌ఎఫ్‌లో 19,987 ఖాళీలు

సీఐఎస్‌ఎఫ్‌లో 19,475

ఎస్‌ఎస్‌బీలో 8,273

అస్సాం రైఫిల్స్‌లో 13,706 ఖాళీలు

సీఏపీఎఫ్‌లో మొత్తం 247 డాక్టర్ పోస్టులు, 2,354 నర్సుల ఖాళీలున్నాయి.

Tags:    

Similar News