నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SBIలో 6160 అప్రెంటిస్ పోస్ట్‌లు
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్ పోస్ట్‌లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్ పోస్ట్‌లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6160 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు: 6160.
ఆంధ్రప్రదేశ్: 390
తెలంగాణ: 125
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
అప్రెంటిస్ వ్యవధి: ఒక ఏడాది.
వయస్సు: గరిష్టంగా 28 సంవత్సరాలు.
(వివిధ వర్గాల వారికి వయస్సు సడలింపు వర్తిస్తుంది)
స్టైపెండ్ నెలకు రూ.15,000.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు : రూ.300
SC/ST/PwD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 1-09-2023
చివరి తేదీ: 21-09-2023
వెబ్‌సైట్: https://www.sbi.co.in/