SHARలో పారా మెడికల్ ఉద్యోగాలు
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్, ఇతర విభాగాల్లో నియామకాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం పోస్ట్లు: 56
అర్హత: పోస్టులను బట్టి 10/డిప్లొమా/PG డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వయస్సు: పోస్టులను బట్టి 18 నుంచి 35 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష జరిగే కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 4-8-2023.
చివరి తేదీ: 24-8-2023.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25-8-2023
వెబ్సైట్: https://www.shar.gov.in/sdscshar/index.jsp