NTPCలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) గేట్- 2023 ద్వారా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) గేట్- 2023 ద్వారా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 495
విభాగాలు:
ఎలక్ట్రికల్-120
మెకానికల్-200
ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్-80
సివిల్-30
మైనింగ్-65.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పాసై ఉండాలి. అలాగే GATE-2023.
వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.300
SC/ST/PwBD/XSM/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 20-10-2023.
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/