నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్: పోస్టల్ శాఖలో 30,041 ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తపాలా శాఖ గతంలో భారీగా పోస్టులను ప్రకటించగా, తాజాగా మళ్లీ కొత్తగా భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Update: 2023-08-03 14:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తపాలా శాఖ గతంలో భారీగా పోస్టులను ప్రకటించగా, తాజాగా మళ్లీ కొత్తగా భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం 30,041 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 30,041

పోస్ట్ పేరు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1058 పోస్టులు

తెలంగాణలో 961 పోస్టులు

అర్హత: పదో తరగతి పాసై ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 100.

మిగతా కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు లేదు.

జీతం:

బీపీఎం పోస్టులకు రూ. 12,000-రూ.29,380

ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- రూ. 24,470.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 3-08-2023.

చివరి తేదీ: 23-08-2023.

దరఖాస్తు సవరణ తేదీ: 24-08-2023 నుండి 26-08-2023.

వయస్సు:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/#


Similar News