వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 250 అప్రెంటిస్ ట్రైనీ పోస్ట్‌లు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొత్తగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-07-13 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొత్తగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


మొత్తం పోస్ట్‌లు: 250

పోస్ట్ పేరు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 200

టెక్నీషియన్ అప్రెంటిస్: 50


అర్హత: 2021/2022/2023 సంవత్సరాలలో సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ /ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, సిరామిక్స్.

స్టైపెండ్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ.9,000 నెలకు, డిప్లొమా అభ్యర్థులకు రూ.8,000.


దరఖాస్తుకు చివరి తేదీ: 31-7-2023

వెబ్‌సైట్: https://www.vizagsteel.com/index.asp


Similar News