SAIL లో 202 ట్రైనీ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిశా పరిధిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఒడిశా పరిధిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ ప్రాతిపదికన ట్రైనీ ఖాళీల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 202
విభాగాలు: మెడికల్ అటెండెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ /రేడియోగ్రాఫర్/ఫార్మసిస్ట్ ట్రైనీ మొదలగునవి.
అర్హత: సంబంధిత విభాగాలను బట్టి డిప్లొమా/డి.ఫార్మా, బి.ఫార్మా/MBA/BBA/PG డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి.
జీతం: పోస్టుల ఆధారంగా రూ.7,000 నుంచి రూ.17,000 వరకు ఉంటుంది.
వయస్సు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ:15-08-2023
చివరి తేదీ: 30-08-2023
వెబ్సైట్: https://www.sail.co.in/en/home