రైల్వేలో ట్రైనీ అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
దిశ, వెబ్డెస్క్: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 190.
పోస్ట్ పేరు: ట్రైనీ అప్రెంటిస్
విభాగాలు:
1. సివిల్ ఇంజనీరింగ్-30
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-20
3. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-10
4. మెకానికల్ ఇంజనీరింగ్-20
5. డిప్లొమా (సివిల్)-30
6. డిప్లొమా (ఎలక్ట్రికల్) -20
7. డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)-10
8. డిప్లొమా (మెకానికల్)-20
9. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు-30
అర్హత: సంబంధిత విభాగాల్లో BE/B.Tech/డిప్లొమా
వయస్సు: 18-25 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100
SC/ ST/ మహిళలు/ minorities/ EWS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 10-12-2023
వెబ్సైట్: https://konkanrailway.com/