రూ.1.10 లక్షల జీతంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) సదరన్ రీజియన్ పరిధిలోని విమానాశ్రయాల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2023-12-20 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) సదరన్ రీజియన్ పరిధిలోని విమానాశ్రయాల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 119

పోస్ట్ పేరు: సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్

1. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)-25

2. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్‌)- 19

3. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్)- 73

4. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)-2

అర్హత: పోస్టులను బట్టి 10,12 వ తరగతి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్‌

వయస్సు: 18-30 ఏళ్లు.

జీతం:

సీనియర్ అసిస్టెంట్‌‌కు రూ.36,000-రూ.1,10,000

జూనియర్ అసిస్టెంట్‌కు రూ.31,000-రూ.92,000.

దరఖాస్తు ప్రారంభ తేదీ:27/12/2023.

చివరి తేదీ: 26/01/2024.

వెబ్‌సైట్: https://www.aai.aero/en

నోటిఫికేషన్: https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI_SR_NOTIFICATION_2023_FINAL_20-12-2023.pdf


Similar News