కరోనా నెగిటివ్ ఉంటేనే విధుల్లోకి..
దిశ, న్యూస్ బ్యూరో: ఉద్యోగులకు కరోనా వైరస్ లేకుంటే మాత్రమే విధుల్లోకి అనుమతించనున్నట్లు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు నిబంధనలు పెట్టాయి. ఇందుకోసం కరోనా నెగెటివ్ ఉన్నట్లు ధృవీకరించే సర్టిఫికెట్‌ను సమర్పించాలని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీతో పాటు ఎన్‌పీడీసీఎర్ సీఎండీ వేర్వేరు సర్క్యులర్లు జారీ చేశారు. ఒకసారి పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చికిత్స అనంతరం కోలుకుని నెగెటివ్ వచ్చినట్లు రిపోర్టు సమర్పించడం తప్పనిసరి షరతు అని స్పష్టం చేశారు. కేవలం హెడ్ ఆఫీసులో మాత్రమే కాకుండా అన్ని సర్కిల్ […]
దిశ, న్యూస్ బ్యూరో: ఉద్యోగులకు కరోనా వైరస్ లేకుంటే మాత్రమే విధుల్లోకి అనుమతించనున్నట్లు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు నిబంధనలు పెట్టాయి. ఇందుకోసం కరోనా నెగెటివ్ ఉన్నట్లు ధృవీకరించే సర్టిఫికెట్‌ను సమర్పించాలని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీతో పాటు ఎన్‌పీడీసీఎర్ సీఎండీ వేర్వేరు సర్క్యులర్లు జారీ చేశారు. ఒకసారి పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చికిత్స అనంతరం కోలుకుని నెగెటివ్ వచ్చినట్లు రిపోర్టు సమర్పించడం తప్పనిసరి షరతు అని స్పష్టం చేశారు. కేవలం హెడ్ ఆఫీసులో మాత్రమే కాకుండా అన్ని సర్కిల్ ఆఫీసుల్లో ఈ షరతు వర్తిస్తుందని పేర్కొన్నారు.కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఇన్ పేషెంట్ అవసరాలకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వస్తే సంబంధిత ఆస్పత్రులతో సమన్వయం చేసుకుని వైద్య చికిత్స కల్పించాల్సిందిగా సంస్థల జాయింట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతీ ఆఫీసులో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని నొక్కిచెప్పారు. ఈ నింబంధనలు 1 జూలై 2020 నుంచి అమలోకి వస్తాయిని తెలిపారు.