మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు సాధించిన JNTUH విద్యార్థులు.. వేతనం ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: జెఎన్‌టీయుహెచ్ విద్యార్థులు కాలేజీలో జరిగిన 2020-21 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విభాగానికి చెందిన మహ్మద్ ముర్తుజా, బబ్బుల స్పూర్తి రాజ్, లకిరెడ్డి సాయి అశ్రీత్ రెడ్డి లు మైక్రోసాఫ్ట్‌లో వార్షిక వేతనం (ఎల్‌పీఏ) 41 లక్షలతో ఉద్యోగాలు సాధించడం యూనివర్శిటీకి గర్వకారణంగా ఉందని అధ్యాపకులు తెలిపారు. అంతేకాకుండా ఈ సీజన్‌లో వీరిదే అత్యధిక వేతన ప్యాకేజీగా వారు వెల్లడించారు. వీరితో పాటు సీఎస్‌ఈ విభాగానికి చెందిన అమీషా 21 […]
దిశ, వెబ్‌డెస్క్: జెఎన్‌టీయుహెచ్ విద్యార్థులు కాలేజీలో జరిగిన 2020-21 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విభాగానికి చెందిన మహ్మద్ ముర్తుజా, బబ్బుల స్పూర్తి రాజ్, లకిరెడ్డి సాయి అశ్రీత్ రెడ్డి లు మైక్రోసాఫ్ట్‌లో వార్షిక వేతనం (ఎల్‌పీఏ) 41 లక్షలతో ఉద్యోగాలు సాధించడం యూనివర్శిటీకి గర్వకారణంగా ఉందని అధ్యాపకులు తెలిపారు. అంతేకాకుండా ఈ సీజన్‌లో వీరిదే అత్యధిక వేతన ప్యాకేజీగా వారు వెల్లడించారు.
వీరితో పాటు సీఎస్‌ఈ విభాగానికి చెందిన అమీషా 21 ఎల్‌పీఏ పే ప్యాకేజీతో వాల్‌మార్ట్‌లో, ఒరాకిల్‌లో 11 ఎల్‌పీఏతో 7 మంది, 10.4 ఎల్‌పీఏతో పెగా సిస్టమ్స్‌లో 9 మంది, ఎల్‌టీఐలో 13 మంది 8.5 ఎల్‌పిఎతో, థాట్ వర్క్స్‌లో ఇద్దరు 8.3 ఎల్‌పిఎతో, ఎన్‌క్యూరో గ్లోబల్‌లో ముగ్గురు విద్యార్థులు 8 ఎల్‌పిఎ పే ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు.
ఇదిలా ఉండగా 7.7 ఎల్‌పీఏతో ఆప్టమ్‌లో ఇద్దరు, టీసీఎస్- డిజిటల్‌లో ముగ్గురు 7.5 ఎల్‌పీఏతో, 7.6 ఎల్‌పీఏతో డెలాయిట్‌లో ఇద్దరు, 7.3 ఎల్‌పీఏతో మోడల్ ఎన్‌లో ముగ్గురు డొమైన్ ఆధారిత సాఫ్ట్‌వేర్, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. వీరితో పాటు మరి కొందరు ప్రముఖ సంస్థల్లో ఎంపికయ్యారు. ప్లేస్‌మెంట్ సీజన్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభు కుమార్, రిజిస్ట్రార్, డాక్టర్ ఎం మంజూర్ హుస్సేన్, ఇతర విశ్వవిద్యాలయ, కళాశాల అధికారులు అభినందించారు.