రూ. 1,999కే జియో ఫోన్ నెక్స్ట్ సొంతం చేసుకోవచ్చు!

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో, గూగుల్ సంయుక్తంగా రూపొందించిన ఈ ఫోన్ దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. శుక్రవారం నాటి ప్రకటనలో ఈ ఫోన్ దీపావళి కానుకగా రూ.1,999 ప్రారంభ ధరకే పొందవచ్చని, మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల్లో సులభ వాయిదా(ఈఎంఐ) పద్దతిలో చెల్లించుకోవచ్చని జియో వెల్లడించింది. […]

Update: 2021-10-29 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో, గూగుల్ సంయుక్తంగా రూపొందించిన ఈ ఫోన్ దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. శుక్రవారం నాటి ప్రకటనలో ఈ ఫోన్ దీపావళి కానుకగా రూ.1,999 ప్రారంభ ధరకే పొందవచ్చని, మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల్లో సులభ వాయిదా(ఈఎంఐ) పద్దతిలో చెల్లించుకోవచ్చని జియో వెల్లడించింది. ఈఎంఐ విధానంలో అందించడం ఫోన్‌ను ఎక్కువమందికి చేరువ చేసేందుకు వీలవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ పండుగ సీజన్‌లో గూగుల్, జియో తెచ్చిన ఈ ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. డిజిటల్ విప్లవంలో భాగంగా దేశంలోని ప్రజల కనెక్టివిటీని పటిష్టం చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ పొందడానికి జియో నాలుగు ఈఎంఐ పథకాలను ప్రవేశపెట్టింది. ఆల్-వేస్ ఆన్ ప్లాన్‌లో వినియోగదారులు రూ. 300 చొప్పున 24 నెలల పాటు ఈఎంఐ చెల్లించవచ్చు. ఇందులో 5జీబీ డేటాతో పాటు 100 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. రూ.350 చొప్పున 18 నెలల పాటు చెల్లించవచ్చు. ఇందులో రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. లార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు రూ. 450 చొప్పున 24 నెలలు చెల్లిస్తే, రోజుకు 1.5 జీబీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. నాలుగు రూ. 500 చొప్పున 18 నెలలు ఈఎంఐ చెల్లించి కొనవచ్చు. ఇందులో 1.5జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఎక్స్ఎల్ ప్లాన్‌లో రూ. 500తో 24 నెలలు, రూ. 550తో 18 నెలలు చెల్లించవచ్చు. ఇందులో రోజుకు 2జీబీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు. డబుల్ ఎక్స్ఎల్ ప్లాన్‌లో రూ. 550తో 24 నెలలు, రూ. 600తో 18 నెలలు చెల్లించవచ్చు. ఇందులో రోజుకు 2.5జీబీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం ఉంటుంది.

Tags:    

Similar News