భారీ పెట్టుబడి దిశగా జియో!
దిశ, సెంట్రల్ డెస్క్: ఇప్పటికే నాలుగు భారీ సంస్థల నుంచి పెట్టుబడులను రాబట్టిన దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్.. మరో భారీ పెట్టుబడిని సాధించనుంది. రిలయన్స్ జియోలో కేకేఆర్ అండ్ కంపెనీ సుమారు 5 నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టు త్వరలో ఒప్పందాన్ని ప్రకటించనున్నట్టు నివేదికలు చెబుతోన్నాయి. రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం విలువ ఒక బిలియన్ డాలర్లు( సుమారు రూ. […]
దిశ, సెంట్రల్ డెస్క్: ఇప్పటికే నాలుగు భారీ సంస్థల నుంచి పెట్టుబడులను రాబట్టిన దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్.. మరో భారీ పెట్టుబడిని సాధించనుంది. రిలయన్స్ జియోలో కేకేఆర్ అండ్ కంపెనీ సుమారు 5 నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టు త్వరలో ఒప్పందాన్ని ప్రకటించనున్నట్టు నివేదికలు చెబుతోన్నాయి. రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం విలువ ఒక బిలియన్ డాలర్లు( సుమారు రూ. 7000 కోట్లకు పైగా) ఉండనుంది.
దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ సారథ్యంలో జియో ఏప్రిల్ నెల నుంచి ఫేస్‌బుక్ సహా నాలుగు వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పటికే ఈ నాలుగు పెట్టుబడుల ద్వారా రూ. 67,500 కోట్లకు పైగా సేకరించింది. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా పార్ట్‌నర్స్, జనరిక్ అట్లాంటిక్ దిగ్గజాలు రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకున్నాయి. వీటితో పాటు సౌదీ సావరిన్ ఫండ్ పీఐఎఫ్ సైతం జియోలో వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జియో తొలినుంచి పబ్లిక్ ఆఫర్‌కు ముందే తన వాటాను 75 నుంచి 80 శాతం వరకు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2021 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత సంస్థగా మార్చే ప్రయత్నంలో ఈ వాటా విక్రయాలను చేపడుతున్నారు.