సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి సీఎం
దిశ, వెబ్ డెస్క్: తన మంత్రిమండలిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో..జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. కేబినెట్ మంత్రి మిథిలేష్ ఠాకూర్ జీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యే మధుర మహాటో జీ ఇద్దరికి కరోనా రావడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం వారిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. తాను కూడా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇంట్లో నుంచే విధులు […]
దిశ, వెబ్ డెస్క్: తన మంత్రిమండలిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో..జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. కేబినెట్ మంత్రి మిథిలేష్ ఠాకూర్ జీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యే మధుర మహాటో జీ ఇద్దరికి కరోనా రావడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం వారిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. తాను కూడా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇంట్లో నుంచే విధులు నిర్వర్తిస్తాను’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
బుధవారం నాటికి జార్ఖండ్‌లో 3,056 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 2,104 కేసులు రికవరీ కాగా.. 930 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కరోనాతో 22 మంది మరణించారు.