అభిమానుల మనసు దోచిన జాన్వీ

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ.. అభిమానులు డ్యాన్స్ చేయాలని కోరడంతో స్టెప్పులు వేసింది. తన తొలి సినిమా ‘ధడక్‌’లోని ‘జింగాత్..’ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇంతకు ముందు కూడా జాన్వీ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయినా.. బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఫ్యాన్స్ అడగ్గానే స్టెప్పులు వేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తల్లి శ్రీదేవికి మించిన హీరోయిన్ […]

Update: 2020-03-10 23:55 GMT
అభిమానుల మనసు దోచిన జాన్వీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ.. అభిమానులు డ్యాన్స్ చేయాలని కోరడంతో స్టెప్పులు వేసింది. తన తొలి సినిమా ‘ధడక్‌’లోని ‘జింగాత్..’ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇంతకు ముందు కూడా జాన్వీ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయినా.. బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఫ్యాన్స్ అడగ్గానే స్టెప్పులు వేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తల్లి శ్రీదేవికి మించిన హీరోయిన్ కావాలని ఆశీర్వదిస్తున్నారు.

కాగా ‘ధడక్‌’ సినిమా తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో ‘ఘోస్ట్ సిరీస్’లో కనిపించిన జాన్వీ… తన తర్వాతి చిత్రం ‘గుంజన్ సక్సేనా : ద కార్గిల్ గర్ల్‌’తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఏప్రిల్ 24న సినిమా విడుదలకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించారు. కాగా జాన్వీ ‘తక్త్’, ‘రూహీ అఫ్జా’, ‘దోస్తానా 2’ సినిమా షూటింగ్‌‌లతో బిజీగా ఉంది.

Tags:    

Similar News