విమానంలో క్రాప్‌టాప్ లొల్లి.. ఇలా ఉంటే ఎగరలేవు!
దిశ, వెబ్‌డెస్క్ : మోడల్స్ అంటే ఎలాంటి దుస్తులు ధరిస్తారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం వారి వృత్తిలో భాగం. వేషాధారణ విషయంలో వారికి కొన్ని ప్రత్యేక లిమిట్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్‌లో భాగమైన వారికి అలాంటి డ్రెస్సులు వేసుకోవడం పెద్దగా ఇబ్బందికరంగా అనిపించకపోవచ్చు. ఫస్ట్ టైం అలాంటి వేషాధారణలో ఉన్న వారిని చూసి బయట వ్యక్తులు ఇబ్బందికరంగా ఫీల్ అవ్వొచ్చు. కానీ, వారిని చులకన చేసి మాట్లాడకూడదు. అందువలన వారి మనోభావాలు దెబ్బతినే […]
దిశ, వెబ్‌డెస్క్ : మోడల్స్ అంటే ఎలాంటి దుస్తులు ధరిస్తారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం వారి వృత్తిలో భాగం. వేషాధారణ విషయంలో వారికి కొన్ని ప్రత్యేక లిమిట్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్‌లో భాగమైన వారికి అలాంటి డ్రెస్సులు వేసుకోవడం పెద్దగా ఇబ్బందికరంగా అనిపించకపోవచ్చు. ఫస్ట్ టైం అలాంటి వేషాధారణలో ఉన్న వారిని చూసి బయట వ్యక్తులు ఇబ్బందికరంగా ఫీల్ అవ్వొచ్చు. కానీ, వారిని చులకన చేసి మాట్లాడకూడదు. అందువలన వారి మనోభావాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
అయితే, ఇక్కడ రియల్ మోడల్స్‌కు తగినట్లుగా ఇటీవల కాలంలో ఇన్ స్టా గ్రామ్ మోడల్స్ తెగ ఫేమస్ అయిపోతున్నారు. వారు ధరించే దుస్తులు, యాక్టింగ్ విషయంలో రియల్ మోడల్స్‌ను ఏమాత్రం తీసిపోవడం లేదు. ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ‘ఇసబెల్లె’ అనే మోడల్‌కు ఆస్ట్రేలియాలోని ఓ ఏయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది.
ట్రావెలింగ్‌లో భాగంగా ఆమె ‘క్రాప్‌టాప్’ ధరించింది. ఆ వేషాధారణ చూసి జెట్‌స్టార్ ఏయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆమెతో కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. ‘‘మీరు వెంటనే మీ ఒంటిని కవర్ చేసుకోండి.. మీరు ధరించినదేమి బికినీ కాదు.. ఇలా ఉంటే ఎగరలేరు’’ అని తోటి ప్రయాణికుల ముందు అన్నాడు. వెంటనే స్పందించిన ఆమె నేను వేసుకున్నది క్రాప్‌ట్రాప్ అని సమాధానమిచ్చింది. అందుకు అంగీకరించని విమాన సిబ్బంది ఆమె సహాయకురాలితో వేరే దుస్తులు ధరింపజేశారు.