కశ్మీర్‌లో మరో ముంబయి 26/11?

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో 26/11 తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గురువారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైన విషయం విధితమే. ఉగ్రవాదులు తీసుకువచ్చిన ట్రక్కులో నుంచి 11 […]

Update: 2020-11-20 06:49 GMT

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో 26/11 తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గురువారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైన విషయం విధితమే. ఉగ్రవాదులు తీసుకువచ్చిన ట్రక్కులో నుంచి 11 ఏకే 47 రైఫిళ్లు, మూడు పిస్టోళ్లు, 29 గ్రేనేడ్లు, ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి 26/11 దాడులు జరిగి 12ఏండ్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 26 కశ్మీర్ లోయలో అదే తరహా దాడులకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News