చరిత్ర సృష్టించిన జెఫ్ బెజోస్.. స్పేస్ టూర్ సక్సెస్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ కుబేరుడు జెఫ్​బెజోస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. మంగళ వారం పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత కక్షలోకి వ్యోమనౌకను చేర్చి.. రాకెట్ బూస్టర్​ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. ఈ వ్యోమనౌక మొత్తం106 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బృందం కొన్ని […]

Update: 2021-07-20 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ కుబేరుడు జెఫ్​బెజోస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. మంగళ వారం పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత కక్షలోకి వ్యోమనౌకను చేర్చి.. రాకెట్ బూస్టర్​ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. ఈ వ్యోమనౌక మొత్తం106 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది.

జెఫ్ బెజోస్ బృందం కొన్ని క్షణాల పాటు మైక్రోగ్రావిటీ స్థితిని అనుభూతి చెందారని బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. ఆ తర్వాత.. కొన్ని నిమిషాల్లోనే వ్యోమగాములు ఉన్న క్యాప్సూల్ పేరాషూట్స్​సాయంతో సురక్షితంగా భూమిని చేరుకుంది. వెంటనే బ్లూ ఆరిజిన్ సిబ్బంది.. క్యాప్సూల్ వద్దకు చేరుకుని.. బెజోస్ బృందాన్ని అభినందనల్లో ముంచెత్తారు. అయితే, నలుగురు సభ్యుల బృందంలో జెఫ్​ బెజోస్​ సోదరుడు మార్క్ బెజోస్, ప్రముఖ మహిళా పైలట్​ వేలీ ఫంక్ (82), ఆలివర్‌ డేమన్‌ (18) ఉన్నారు. బెజోస్ సోదరులు కాకుండా మిగతా ఇద్దరు.. అంతరిక్షయానం చేసిన వారిలో అత్యంత పెద్ద, పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించారు.

Tags:    

Similar News