జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలు రిలీజ్..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా దేశంలో పలు పరీక్షలు రద్దు కాగా, మరిన్ని ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వనిస్తున్నది. 3వ సెషన్ పరీక్షల కోసం జూలై 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. చివరి తేది జూలై […]

Update: 2021-07-06 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా దేశంలో పలు పరీక్షలు రద్దు కాగా, మరిన్ని ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వనిస్తున్నది. 3వ సెషన్ పరీక్షల కోసం జూలై 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. చివరి తేది జూలై 8గా నిర్ణయించారు.

జూలై 20 నుంచి 25 మధ్య థర్డ్​ఎడిషన్, జూలై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్​పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఇది వరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సెషన్, కేటగిరీ, సబ్జెక్ట్‌లను మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. కరోనా నేపథ్యంలో గతంలో కంటే ఈ సారి పరీక్షలను నిర్వహించే నగరాలను 232 నుంచి 334 వరకు పెంచారు. పరీక్షా కేంద్రాలను 660 నుంచి 828కి పెంచారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండే పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు.

Tags:    

Similar News