అరుణాచల్‌లో జేడీయూకు షాక్

గువహతి : అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మొత్తం ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరారు. వీరితోపాటు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) ఏకైక ఎమ్మెల్యే కూడా కాషాయపార్టీలో చేరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏలో మేజర్ పార్టీగా ఉన్న జేడీయూ ఒక్కసారిగా జూనియర్ అయిపోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ తరుణంలో అరుణాచల్ ప్రదేశ్‌లోనూ జేడీయూకు బీజేపీ షాక్ ఇవ్వడం గమనార్హం. జేడీయూ ఎమ్మెల్యేలు తలేమ్ తబో, హయేంగ్ మాంగ్ఫి, […]

Update: 2020-12-25 06:00 GMT

గువహతి : అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మొత్తం ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరారు. వీరితోపాటు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) ఏకైక ఎమ్మెల్యే కూడా కాషాయపార్టీలో చేరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏలో మేజర్ పార్టీగా ఉన్న జేడీయూ ఒక్కసారిగా జూనియర్ అయిపోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ తరుణంలో అరుణాచల్ ప్రదేశ్‌లోనూ జేడీయూకు బీజేపీ షాక్ ఇవ్వడం గమనార్హం.

జేడీయూ ఎమ్మెల్యేలు తలేమ్ తబో, హయేంగ్ మాంగ్ఫి, జిక్కె తకో, దొర్జీ వాంగ్డీ ఖర్మ, డోంగ్రు సింగ్జు, కాంగాంగ్ తకు‌ బీజేపీలోకి చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సింగ్జు, ఖర్మ, తాకులకు జేడీయూ గతనెల 26న షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసింది. తాజాగా, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పంచాయతీ, మున్సిపల్ ఫలితాలు వెలువడనున్న ఒక రోజు ముందు బీజేపీలోకి చేరడం గమనార్హం.

Tags:    

Similar News