24 గంటల్లోనే మళ్లీ అరెస్టు.. జేసీపై మరో 3కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్ది, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన 24 గంట్లోనే మళ్లీ అరెస్టయ్యారు. గురువారం బెయిల్ పైన విడుదలైన సందర్భంగా జేసీ, ఆయన కుమారుడు ఇద్దరూ తమ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న దళిత వర్గానికి చెందిన తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విచారణ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్ది, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన 24 గంట్లోనే మళ్లీ అరెస్టయ్యారు. గురువారం బెయిల్ పైన విడుదలైన సందర్భంగా జేసీ, ఆయన కుమారుడు ఇద్దరూ తమ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న దళిత వర్గానికి చెందిన తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరంపురం పోలీసులు ఆయనపై 506, 189, 353 సెక్షన్ల కింద, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 52 కింద మొత్తం కలిపి మరో మూడు కేసులు పెట్టారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడి అరెస్టుతో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రిలో ముందస్తుగా 144 సెక్షన్ విధించారు.