ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా

దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా..,అనుపమ పరమేశ్వరన్ను పెళ్లి చేసుకుంటారా? లేదంటే సంజనా గణేషన్ ను పెళ్లి చేసుకుంటారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత్ – ఇంగ్లాండ్ మధ్య మోతేరాలో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ తో పాటూ  ఐదు టీ20 ల సిరీస్ కు  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా దూరమైన విషయం తెలిసిందే. దీంతో 3వ టెస్ట్ మ్యాచ్ తరువాత జస్ప్రిత్ బూమ్రా ఎందుకు దూరమయ్యాడంటూ క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం […]

Update: 2021-03-09 06:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా..,అనుపమ పరమేశ్వరన్ను పెళ్లి చేసుకుంటారా? లేదంటే సంజనా గణేషన్ ను పెళ్లి చేసుకుంటారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

భారత్ – ఇంగ్లాండ్ మధ్య మోతేరాలో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ తో పాటూ ఐదు టీ20 ల సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా దూరమైన విషయం తెలిసిందే. దీంతో 3వ టెస్ట్ మ్యాచ్ తరువాత జస్ప్రిత్ బూమ్రా ఎందుకు దూరమయ్యాడంటూ క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జస్ప్రిత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీసీసీఐ కన్ఫాం చేసింది. అంతేకాదు పెళ్లి పనుల కోసమే నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడలేదని స్పష్టం చేసింది. దీంతో జస్ప్రిత్ బూమ్రూ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జస్ప్రిత్ అనుపమాను పెళ్లి చేసుకుంటున్నారంటూ వైరల్ అవుతున్న వార్తలపై ఆమె తల్లి స్పందించారు. తన కుమార్తెపై వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేయడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది.

ఫైనల్ గా ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మార్చి 14న గోవాలో జస్ప్రిత్ బూమ్రా పెళ్లి వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకూ ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ పాటలు పాడుకోవాల్సిందే.

Tags:    

Similar News