శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్
దిశ, ఏపీ బ్యూరో: చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసుయుకి సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి.. శ్రీసిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాలపై వివరించారు. శ్రీసిటీని ‘మినీ జపాన్’ గా పిలుస్తారని, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, లాజిస్టిక్ వంటి వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 24పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయని అన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు, 10వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. శ్రీసిటీలోని మౌలిక […]
దిశ, ఏపీ బ్యూరో: చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసుయుకి సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి.. శ్రీసిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాలపై వివరించారు. శ్రీసిటీని ‘మినీ జపాన్’ గా పిలుస్తారని, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, లాజిస్టిక్ వంటి వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 24పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయని అన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు, 10వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. శ్రీసిటీలోని మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్, వ్యాపార నిర్వహణకు అత్యంత అనువైన పారిశ్రామికవాడల్లో శ్రీసిటీ ఒకటని ప్రశంసించారు.
Read Also…