బొద్దింకల రసంతో టేస్టీ బీర్.. మార్కెట్‌లో ఫుల్ డిమాండ్!

దిశ, ఫీచర్స్ : భూమిపై ఆహార వస్తువులకు కొదువ లేదు. పండ్లు, కూరగాయలు, జంతువులు & పక్షుల మాంసం.. ఇలాంటి ఫుడ్స్ ఏవైనా హెల్తీసెస్‌కు సాయపడతాయని నమ్మకం కుదిరితే చాలు వెంటనే తమ ఫుడ్ లిస్ట్‌లో చేర్చేస్తారు. ఇక చైనా వంటి సౌత్ ఏషియన్ దేశాల్లో పురుగులు, పాముల్ని కూడా ఆహారంగా తీసుకుంటారని తెలిసిందే. తలచుకుంటే కొంచెం వికారంగా ఉన్నా ఇది నిజమే. ఇదిలా ఉంటే.. జపాన్‌లో మరీ వింతగా బొద్దింకల నుంచి బీరు తయారు చేస్తున్నారు. […]

Update: 2021-12-13 03:53 GMT

దిశ, ఫీచర్స్ : భూమిపై ఆహార వస్తువులకు కొదువ లేదు. పండ్లు, కూరగాయలు, జంతువులు & పక్షుల మాంసం.. ఇలాంటి ఫుడ్స్ ఏవైనా హెల్తీసెస్‌కు సాయపడతాయని నమ్మకం కుదిరితే చాలు వెంటనే తమ ఫుడ్ లిస్ట్‌లో చేర్చేస్తారు. ఇక చైనా వంటి సౌత్ ఏషియన్ దేశాల్లో పురుగులు, పాముల్ని కూడా ఆహారంగా తీసుకుంటారని తెలిసిందే. తలచుకుంటే కొంచెం వికారంగా ఉన్నా ఇది నిజమే. ఇదిలా ఉంటే.. జపాన్‌లో మరీ వింతగా బొద్దింకల నుంచి బీరు తయారు చేస్తున్నారు. ‘ఇన్‌‌సెక్ట్ సోర్’ లేదా ‘కొంచు సోర్’గా పిలవబడే ఈ బీరును ‘కబుతోకామా’ అనే ట్రెడిషనల్ పద్దతిలో తయారుచేస్తుండగా, 20వ శతాబ్దం నుంచి అందుబాటులోకి వచ్చింది.

జపనీయులు ఈ కాక్రోచ్ బీర్‌ను ఫ్రెష్ వాటర్‌లో లభించే బొద్దింకలతో తయారు చేస్తారు. నీటిలో దొరికే ఇతర కీటకాలు, చేపలను తిని పెరిగే బొద్దింకలను పట్టుకునే తయారీదారులు ముందుగా వాటిని వేడి నీటిలో నానబెట్టి, మూడు నుంచి నాలుగురోజుల పాటు అలాగే ఉంచుతారు. ఆ తర్వాత బొద్దింకల రసాన్ని బయటకు తీసి, సంప్రదాయ పద్ధతుల్లో డ్రింక్‌గా మార్చేస్తారు. ఇక మేల్ తైవానీస్ కాక్రోచ్‌ల‌తో తయారు చేసే బీరుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండగా.. కాక్రోచ్ బీర్ విలువ రూ. 450 నుంచి మొదలవుతుంది. ఈ తైవానీస్ కాక్రోచ్‌లను నాణ్యమైన రొయ్యగా అభివర్ణించే స్థానికులు.. సూప్స్‌తో పాటు కూరల్లో మసాలాగా కూడా ఉపయోగిస్తారు.

Tags:    

Similar News