ఎంబీబీఎస్ అడ్మిషన్లకు జనవరి 15 తుది గడువు

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరడానికి తొలుత ఆగస్టు 31 తుది గడువు అని ప్రకటించినా కరోనా పరిస్థితుల్లో మార్పు చేయాల్సి వచ్చిందని, ఈ స్థానంలో వచ్చే ఏడాది జనవరి 15 వరకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టులో నేషనల్ మెడికల్ కమిషన్ దరఖాస్తు దాఖలు చేసింది. కరోనా పరిస్థితులు, దానితో పాటు వచ్చిన లాక్‌డౌన్ కారణంగా వైద్య కళాశాలలను తెరవడంలో జాప్యం జరిగిందని, ఆ కారణంగా అడ్మిషన్ల ప్రక్రియలో కూడా మార్పులు […]

Update: 2020-12-24 12:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరడానికి తొలుత ఆగస్టు 31 తుది గడువు అని ప్రకటించినా కరోనా పరిస్థితుల్లో మార్పు చేయాల్సి వచ్చిందని, ఈ స్థానంలో వచ్చే ఏడాది జనవరి 15 వరకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టులో నేషనల్ మెడికల్ కమిషన్ దరఖాస్తు దాఖలు చేసింది. కరోనా పరిస్థితులు, దానితో పాటు వచ్చిన లాక్‌డౌన్ కారణంగా వైద్య కళాశాలలను తెరవడంలో జాప్యం జరిగిందని, ఆ కారణంగా అడ్మిషన్ల ప్రక్రియలో కూడా మార్పులు అనివార్యమయ్యాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరడానికి, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు గడువును జనవరి 15వ తేదీ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు వెలువరించే ఉత్తర్వులకు అనుగుణంగా మరింత స్పష్టతను వెబ్‌సైట్‌లో తెలియజేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఆర్‌కే వత్స ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News