ఇదా సమయం?… ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కల్యాణ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం పట్ల ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీని తొలగించడానికి ఇదా సరైన సమయం అని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా లేఖ రాసిన పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. యావద్భారత దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాలేంటని పవన్ ప్రశ్నించారు. కరోనా మహమ్మారి […]

Update: 2020-04-10 16:57 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం పట్ల ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీని తొలగించడానికి ఇదా సరైన సమయం అని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా లేఖ రాసిన పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు.

యావద్భారత దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాలేంటని పవన్ ప్రశ్నించారు. కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల కమిషనర్ ను తొలగించడానికి ఇదేనా? సరైన సమయం అని ఆయన నిలదీశారు. జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కీలక అంశాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఎన్నికలు జరిపి ఉంటే ప్రజల ప్రాణాలకు ఎంత ప్రమాదం వాటిల్లేదో ఊహించగలమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కాపాడడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన వేళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హితవు పలికారు.

Tags: pawan kalyan, janasena, sec, nimmagadda ramesh kumar, ysrcp, ys jagan, letter to ap governament

Tags:    

Similar News